ఈ రోజు తేది:
సమయం:
Telugu Theater    
 
సినిమాలు వార్తలు భక్తి పిల్లలకోసం సరదాగ వనిత ఆయుర్వేదం యోగా పాటలు
 
 
ఆయుర్వేదం తులసి పిల్లలకోసం ముగ్గులు బల్బుల ముగ్గు ఆరోగ్యం యోగ
 
కబుర్లు
7 Eleven Shipping Pvt. Ltd.
Benevolent Shipping Pvt. Ltd.
Telugu Theater Arogyam
కేన్సర్.....
ఇప్పుడు ప్రజలను వణికిస్తున్న మహమ్మారి కేన్సర్. నూటికి తొంభై మంది ఏదో ఒక రకమైన కేన్సర్ బారిన పడుతున్నారు. మన శరీరంలో కేన్సర్ సోకని భాగం లేదు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కేన్సర్ మన శరీరంలో ముఖ్యమైన కన్ను, ముక్కులను కూడా వదలకుండా ఉన్నాయి అంటే ఇది ఎంతటి భయంకర మైనదో ఊహించవచ్చు. ప్రతీవారినీ ఈ కేన్సర్ బారినుండి తప్పించటానికి దానిమీద సరైన అవగాహన కలిగించటానికి మా ఈ చిన్న ప్రయత్నం.
కేన్సర్ అంటే ఏమిటి?
మానవ శరీరము కణాల సముదాయంతో నిర్మింపబడి ఉంటుంది. ఇవి అన్నీ శరీర నిర్మాణంలో ముఖ్యమైన జీవకణాలపై ప్రభావం చూపుతాయి. జీవకణాలు నిర్ణీత పద్దతిలో పెరుగుట, నశించుట జరుగును. కణాలు శరీర అవసరాలకు అనుగుణంగా పునర్నిర్మాణం జరుగుతుంది. ఇలా క్రమపద్దతిలో విభజన జరిగితేనే మన శరీరం ఆరోగ్యంగా వుంటుంది. కొన్ని సందర్భాలలో ఇవి ఎలాంటి నియమ నియంత్రణ లేకుండా పెరిగుతూ ఉంటాయి. క్రొత్త కణాల అవసరం లేకుండానే కణవిభజన జరిగితే ఒక ముద్దలాంటి పదార్ధం తయారౌతుంది. ఈ అవసరం లేని పదార్ధాన్నే 'కేన్సర్' లేద 'కణితి' అంటారు. ఈ కణితినే ఇది ప్రమాద కరమైన, ప్రమాదకరం కాని అని రెండు రకాలుగా ఉంటుంది.
ప్రమాదకరం కానివి:
వీటిని కేన్సర్ అనరు. ఈ రకములైన కణితుల్ని సులభంగా తొలగించవచ్చును. సహజంగా ఇవి తిరగబెట్టవు, ఇతర భాగాలకు వ్యాప్తి చెందవు. ఇవి ప్రమాద రహితములు. ఉదా: సర్విక్స్ నుండి ఉద్భవించే పుసి కండలు, తిత్తులు, పులిపిరికాయలు ఈ కోవకు చెందినవి.
ప్రమాద కరమైనవి:
ప్రమాద కరమైన కణితుల్నే కేన్సర్లంటారు. ఇవి వీటిని ఆనుకొని ఉండే ఇతర అవయవాలకు వ్యాపించి, వాటికి హాని కలిగించవచ్చును. ఈ కణాలు చితికిపోయి రక్త నాళాలు ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతాయి.

 

కేన్సర్ ఇతర భాగాలకు వ్యాప్తి చెందినపుడు, కొత్తగా యేర్పడిన భాగం కూడా అదే పేరుతో పిలువబడుతుంది. ఉదా:- సర్విక్స్ కేన్సర్ కణాలు ఎముకల్లో ప్రవేశించా యనుకుంటే దానిని "మోటాస్టేటిక్ సర్వికల్ కేన్సర్" అంటారేకాని, ఎముకయొక్క కేన్సర్ అనరు.

కేన్సర్ సూచనలు:
కేన్సర్ పై పొరలలో ఉండే కణాలు ఒక్కోసారి అసహజంగా పెరుగుతుటాయి. అంతమాత్రాన అవి కేన్సర్ లక్షణాలు కాకపోవచ్చు. నెమ్మది నెమ్మదిగ అవి మార్పు చెంది కొంతకాలం తరువాత కేన్సర్లుగా మారే అవకాశమున్నది. ఇలా మార్పు చెందటాన్ని యస్.ఐ.ఎల్ అంటారు. ఇవి రెండు రకాలు. 1 . తక్కువ ప్రమాదకరమైనవి 2. ఎక్కువ ప్రమాద కరమైనవి.
తక్కువ ప్రమాదకరమైనవి:
క్రొత్తగా మార్పు చెందే కణజాలముల యొక్క ఆకృతి, పరిమాణం సంఖ్యల ఆధారంగా దీన్నిలా పేర్కొంటారు. కాని కాలానుగుణంగా కొన్ని వాటంతటవే నిష్క్రమించవచ్చును. కొన్ని అసమాన్యంగాను, పెద్దవిగాను పెరిగి ప్రమాదకరంగా పరిణమించవచ్చును.
ఎక్కువ ప్రమాద కరమైనవి:
దీనిలో చాలా ప్రత్యేకమైన, చాలా యెక్కువగా ఉండే కణజాలం శరీర భాగం పైపొరలలొ ఉంటాయి, కాని చాలాకాలం తర్వాత లోపలి పొరలలోకి చొచ్చుకు పోవచ్చును.
కేన్సర్ ను గుర్తించుట:
ప్రతి వారు తమ శరీర భాగల్లో ఏదైన తేడాగా అనిపించిన, లేదా శరీరం మీద ఏమైనా గడ్డలు లాంటివి కనిపించినా వెంటనే డాక్టరును సంఫ్రదించాలి. దానికి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ కేస్నర్ లక్షణాలు కనుక కనిపిస్తే దానిని ప్రధమ దసలోనె కనుగొనుట సాద్యం అవ్వుతుంది. తగిన వైద్య సహాయం పొంది, చికిత్స సులభ మవుతుంది.
క్యాన్సర్ ను ఓడించే సప్త సూత్రాలు:
హైద్రాబాద్ లోని 'ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్', 'స్వేచ్చ ఫౌండేషన్' సహకారంతో జులై 7 న 'క్యాంప్ 777 ' పెరుతో క్యాన్సర్ అవగాహనకు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా క్యాన్సర్ నివారణకు 7 సూచనలు చేసింది.
1 హఠాత్తుగా మలబద్దకం రావడం, మింగడం కస్తమవడం, రొమ్ము, ఇతర భగల్లొ ఎవైన గడ్డలు ఏర్పడడం వంటి లక్ష్ణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
2 క్యాన్సర్ నుగుర్తించటానికి సి.ఎస్.ప్ పరీక్ష తప్పనిసరిగ చేయించుకోవాలి.
3 మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి
4 సమతులా ఆహారం, నిద్రాహారాల్లో సమయపాలన అవసరం.
5 క్రమమం తప్పని వ్యాయామం ఉండాలి
6 వ్యక్తివత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి.
7 మద్యం, ధూమపానం, కిళ్ళీ, గుట్కాలకు దూరంగా ఉండాలి.
 
 
 
   
   
  @ 2009 Telugu Theater Designed and Powered by