ఈ రోజు తేది:
సమయం:
Telugu Theater    
 
సినిమాలు వార్తలు భక్తి పిల్లలకోసం సరదాగ వనిత ఆయుర్వేదం యోగా పాటలు
 
 
ఆయుర్వేదం తులసి పిల్లలకోసం ముగ్గులు బల్బుల ముగ్గు ఆరోగ్యం యోగ
 
7 Eleven Shipping Pvt. Ltd.
Oscan Elevators
Telugu Theater Muggulu

మనకున్న ౬౪ కళల్లో ముగ్గులు వెయ్యటం కూడా ఒక కళ. ప్రతివారి లోనూ ఎంతో కొంత కళా హృదయం ఉంటుంది. ఎవరింటికి వెళ్ళినా ముందుగా మనల్ని పలకరించేవి ముగ్గులే. చక్కని ముగ్గులున్న లోగిలి చూడగానే ముచ్చట వేస్తుంది. లక్ష్మీకళ ఉట్టిపడుతున్నట్లు అనిపిస్తుంది. ముగ్గులు అనగానే మనకు పల్లెటూళ్ళు గుర్తుకు వస్తాయి. ఒకప్పుడు పల్లె వీధులన్నీ ముగ్గులతో నింపేవారు. కాల క్రమేణా మట్టి రోడ్లు సిమెంట్ రోడ్లుగా మారటం, వచ్చే పోయే వాహనాలతో కిటకిట లాడే రోడ్లమీద ముగ్గులు మెరిసే అవకాసాలు కనిపీంచటంలేదు. అలాంటి అరుదైన సందడి పండుగలప్పుడు మాత్రం అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీధిగుమ్మంలొ చిన్న చిన్న ముగ్గులతో సరిపెడుతున్నారు.

 

అసలు ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా? పూర్వం ముగ్గులను వరి పిండితో వేసేవారు. ఎందుకంటే ఆ పిండిని చీమలు తినేవి. వాటికి ఆహారం వెయ్యటం కోసం ముగ్గులు పెట్టేవారు. ఆ సంప్రదాయం అంతరించిపోయి, మన ముగ్గులు ఇంటికి అలంకారాలుగా మాత్రమే మిగిలి పోయయి. రాను రాను ముగ్గులను సున్నపు పొడితోను, చాక్ పీస్ లతోను ముగించేస్తున్నారు. కాలం ఎంత మారినా, మనలో కొన్ని సంప్రదాయాలు నర నరాల్లోన్నూ జీర్నించుకు పోయాయి. కాలంతో ఎంత పరిగెడుతున్నా, ఈ చిరు సంప్రదాయాన్నికి ప్రాణం పోసి అభివృద్దికి పాటుపడుతున్న వారికోసమే మాఈ "తెలుగు థియేటర్ - ముగ్గులు".

 

ఈ శీర్షికకు మీరు మీ సలహాలను పంపవచ్చు. మీలో ఆసక్తి ఉన్నవారు మీ ముగ్గులను మా "తెలుగు థియేటర్" ద్వారా మిగిలిన వారికి పంచే అవకాసం కల్పిస్తున్నాము. మీ ఫోటోను కూడా జతచేసి మా చిరునామా muggulu@telugutheater.com కు పంపవచ్చు.

Telugu Theater Muggulu Telugu Theater Muggulu Telugu Theater Muggulu Telugu Theater Muggulu Telugu Theater Muggulu
001 002 003 004 005
         
Benevolent Shipping Pvt. Ltd.
   
   
  @ 2009 Telugu Theater Designed and Powered by