"మానవుడు సంఘజీవి".
ఈ సంఘంలో ఉంటున్నందుకు
నలుగురితో పాటు
మనమూ ఉన్నాం
అని కాకుండా,
మనకంటూ ఒక ప్రత్యేక
గుర్తింపు ఉండేలా
చూసుకోవాలి.
ప్రతి వారిలోనూ
ఏదో సాధించాలి
అన్న తపన ఉండాలి.
దానిలోనుండే
మనకు ఒక లక్ష్యం
పుడుతుంది.
కాని అది స్థిరమైనదిగా
ఉండాలి. ప్రతిరోజు,
ప్రతి గంటకు
మరిపోతూ ఉండే
లక్ష్యాలతో
మనం ఏమీ సాధించలేము.
ఆ లక్ష్యాన్ని
సాధించగలం అన్న
నమ్మకం మనమీద
మనకి ఉండాలి.
అతి తక్కువ
సమయంలో అనుకున్న
లక్ష్యం సాధించడానికి
కావలసినది "సరియైన
ప్రణాళిక".
మనం చేసే పని
ఎంత చిన్నది
అయినా, ప్రణాళికను
రూపొందించు
కోవటం వల్ల
సమయం వృధా కాదు
మరియు విజయాన్ని
సులభంగా చెజిక్కించుకోవచ్చు.
నిన్న మొన్నటి
వరకు సాఫ్ట్‍వేర్
రంగం రాజ్యం
ఏలిన తరుణంలో
ప్రతి ఒక్కరి
దృష్టి దానిమీదనే
ఉండేది. ప్రస్తుతం
ఆర్ధిక మాన్ధ్యం
వల్ల చాలా కంపెనీలు
మూతపడి పోవటం
వల్ల చాల మంది
నిరుద్యోగుల్లా
మిగిలిపోయారు.
ఇలాంటి సమయంలో
స్తిరమైన జీత
భత్యలు, ఉద్యొగ
బద్రత, సమాజంలొ
హోదాతో వచే
గుర్తింపు వైపు
ప్రతి ఒక్కరు
మొగ్గు చూపుతున్నరు.
లక్ష్యం చిన్నదా,
పెద్దద అన్నది
ముఖ్యం కాదు.
మనవల్ల పదిమందికీ
ఉపయోగం ఉన్నదా
లేదా అన్నది
కూడా అలొచించాలి.
లంచగోడితనం,
అవినీతి విలయ
తాండవం చెస్తున్న
ఈరోజుల్లో వాటి
విషపు కోరల్లో
చిక్కుకున్న
అమాయక ప్రజలకు
చేతనైన సహాయం
చెయ్యడానికి
మన లక్ష్యం
ఉపయోగపడలి.
ఇలాంటి అవకాశం
ఉన్న కొన్ని
ప్రభుత్వ ఉద్యోగాల
కొరకు మన లక్ష్యం
గురిపెట్ట వచ్చును.
మన అంధ్ర ప్రదేశ్
పబ్లిక్ సర్వేస్
కమీషన్ గ్రూప్
-౧, గ్రూప్
- ౨ఉద్యోగాలకు
సంబంధించి భారీ
స్థయిలో నోటిఫికేషన్లు
ఇవ్వటం నిరుద్యోగులకూ,
చిరుద్యోగులకూ
సువర్ణావకాశంగా
ఉన్నది.
రాష్ట్రంలో
అతున్నత సర్వీసులైన
గ్రూప్ - ౧లో
డిఫ్యూటి కలెక్టర్,
డ్.యస్.పి,
కమర్షియల్ టాక్స్
ఆఫిసర్,మున్సిపల్
కమీష్నర్, గ్రేడ్
- ౨, సహాయ ఆడిత్
అధికారి, సహోయ
అకౌంట్స్ అధికారి,
మరియు మండల
పరిషత్ అభివ్రుద్ధి
అధికారి వంటి
విభిన్న రకాల
పోస్టులు ఉన్నాయి.
అతి తక్కువ
కాలంలో పరమొషన్లు
పొందే అవకాశాలు
ఎక్కువ.
అదే విధంగా
రాష్త్రంలో
రండవ అతున్నత
సర్వీసులైన
గ్రూప్ - ౨లో
డిఫ్యూటి తహసిల్దార్,
మున్సిపల్ కమీషనర్
- గ్ర్పూప్
- ౩, సహాయ పన్నుల
అధికారి, లేబర్
ఆఫీసర్, అక్సైజ్,
ఎస్. ఐ వంటి
ఎగ్జిక్యుటివ్
పోస్టులతో పాటు
సహాయ సెక్షన్
అధికారి వంటి
అనేక రకాల పోస్టులున్నాయి.
వీటిలో చేరిన
ఉద్యోగులు ప్రమొషన్
ద్వారా గ్రూప్
-౧ అధికారులుగ
మారవచు.
విపరీతమైన పోటీ
కారణమ్గా లక్ష్యం
ఎంత చిన్నది
అయినా, దానికి
మనం చెయ్యవలసిన
శ్రమ చాలా ఉంటుంది.మంచి
జీవితం కావాలి
అంటే కొంత సంతోషాన్ని,
సుఖాన్ని త్యాగం
చెయ్యవలసి ఉంటుంది.
ప్రతి ఓటమి
మనల్ని ౧౦ అదుగులు
గెలుపు వైపుకు
నెడుతుంది.
పడిన ప్రతిసారి
మనల్ని మనమే
ఉత్సాహ పరచుకోవలి,
ముందుకు నడవాలి.
ఒక పని మొదలు
పెట్టాక వెనకడుగు
వెయ్యకూడదు.
మనం వెల్లే
దారిలో మూళ్ళు,
పూలు రెండూ
ఉంటాయి. జాగ్రత్తగ
అడుగులు వేస్తూ
అనుకున్న లక్ష్యాన్ని
చేరుకోవాలి.
మారుమూల గ్రామాల్లో
ఎన్థో మంది
అర్హత ఉండి,
అవకాశాలు లేక,
బూక్స్ కొని
చదివే స్తోమత
లేని వారికొరకు
ముఖ్యంగా ఇది
ఉపయోగపడలని
మనస్పూర్తిగ
కోరుకుంటూన్నము. |